Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మున్నూరు కాపులకు సముచిత ప్రాధాన్యమిచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ పదవుల్లోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం లభించిందన్నారు. భవిష్యత్తులోనూ మున్నూరు కాపులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం గౌరవాధ్యక్షులు ఏనుగుల సత్యనారాయణ పటేల్ తదితరులు పాల్గొన్నారు.