Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాల్క సుమన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీతో రేవంత్ కుమ్మక్కై సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి ప్రయివేటీకరణపై పార్లమెంటులో రేవంత్ ప్రశ్నించకపోవడంతో బీజేపీకి కోవర్ట్ అనే అనుమానం కలుగుతుందన్నారు. ఒడిశాలో సింగరేణికి చెందినకోల్ బ్లాక్‌లో రూ.50 వేల కోట్ల కుంభ కోణం జరిగిందంటున్న రేవంత్‌కు ఆ నైని కోల్ బ్లాక్‌లో బొగ్గు విలువ కూడా అంత విలువ లేదని తెలుసా అని ప్రశ్నించారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్ సీనియర్లను బయటికి పంపించి కాంగ్రెస్‌ను బీజేపీకి అమ్మే పనిలో రేవంత్ ఉన్నారని ఆరోపించారు. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేసే జోకర్ రేవంత్ అని ఇప్పటికే రుజువైందన్నారు. పియూసీ చైర్మెన్ ఎ. జీవన్ రెడ్డి మాట్లాడుతూ బాయిల్డ్ రైస్ కొనలేమన్న కేంద్రాన్ని వదిలేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సీఎం కేసీఆర్‌పై నోరు పారేసుకుంటే లాభమేంటని ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని కేంద్రం పార్లమెంటులో సమాధానమిచ్చిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ రేవంత్ కేసీఆర్ కుటుంబం గురించి కాంగ్రెస్ నేతల కుటుంబాల గురించి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు.