Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బ్రిటన్‌కు చెందిన గ్లోబల్ డేటా ఎనలిటిక్స్, ఇఆర్పి స్పెషలిస్ట్ కన్సల్టెన్సీ కంపెనీ కగూల్ తెలంగాణలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కొత్త అభివద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శనివారం దీన్ని తెలంగాణ ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ లాంచనంగా ప్రారంభించారు. ''భారతదేశంలో శరవేగంగా వద్ధి చెందాలన్న కంపెనీ ప్రణాళికను కొత్త కార్యాలయ ఏర్పాటు సూచిస్తుంది. మేము 2025 చివరి నాటికి భారతదేశంలో మా సిబ్బంది సంఖ్యను 2000కు పెంచాలని చూస్తున్నాము'' అని కగూల్ డేటా ప్రయివేటు లిమిటెడ్ ఇండియా హెడ్ కళ్యాణ్ గుప్తా బ్రహ్మండ్లపల్లి అన్నారు. ''ఆధునిక క్లౌడ్ టెక్నాలజీలు అంతర్జాతీయ సంస్థలకు తీసుకురాగల విలువ, చురుకుదనాన్ని మా వినియోగదారులు చూస్తున్నారు. వ్యాపార విలువను త్వరగా, ఊహించిన విధంగా సాధించడానికి కగూల్ ను సరైన డెలివరీ భాగస్వామిగా వారు చూస్తున్నారు. అపారమైన టాలెంట్ బేస్, అంకితభావం కలిగిన, ఉత్సాహభరితమైన యువశక్తి ఇక్కడ ఉండటం వల్లే మేము మా భారతదేశ కార్యకలాపాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తున్నాము'' అని కగూల్ గ్రూప్ సిఇఒ డేనియల్ జేమ్స్ బార్లో ఆన్లైన్లో తెలిపారు.