Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
నవతెలంగాణ-శంషాబాద్/నిర్మల్
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం భయాందో ళన వాతావరణాన్ని నెలకొల్పింది. అక్కడికి విద్య, ఉద్యోగాల నిమిత్తం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యుద్ధ వాతావర ణంలో అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొనడంతో భారత విదేశాంగ శాఖ ప్రత్యేక చొరవతో విద్యార్థులు సొంత ప్రాంతానికి చేరుకున్నారు. అందులో తెలంగాణకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఉక్రెయిన్ నుంచి నేరుగా ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ అధికారుల సాయంతో ముంబై నుంచి 20 మంది విద్యార్థులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారికి రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి. ప్రకాష్‌గౌడ్, సీపీ స్టీఫెన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. కాగా, ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చెందిన మిగతా విద్యార్థులను క్షేమంగా తీసుకురావడానికి విదేశాంగ శాఖతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఉచితంగా విమానాల్లో దేశానికి తరలిస్తున్నట్టు తెలిపారు.
ఉక్రెయిన్ బాధితులను పరామర్శించిన మంత్రి
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న బాధితులను మంత్రి ఇంద్రకరణరెడ్డి ఆదివారం వీడియో కాల్ చేసి పరామర్శించారు. అక్కడ చదువుకుంటున్న తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థులను సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరినట్టు తెలిపారు. నిర్మల్ పట్టణం బుధవార్‌పేట్‌కు చెందిన పీజీ వైద్య విద్యార్థి సాయికృష్ణతో మంత్రి వీడియో కాల్లో మాట్లాడారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందన్నారు.