Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో రూ.10వేల కోట్లు కేటాయించాలి : చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తీవ్ర సమస్యలతో సతమతవుతున్న చేతివృత్తిదారులకు వచ్చే వార్షిక బడ్జెట్లోరూ. 10వేల కోట్లు కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. తెలంగాణ మత్స్య కారుల మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ముఖ్యకార్యకర్తల సమావేశం శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో సంఘం అధ్యక్షులు గోరేంకల నర్సింహ్మ అద్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీతారాములు మాట్లడుతూ చేతివృత్తిదారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కాలంలో బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లుకు, వివిధ వృత్తుల పెడరేషన్లకు నిధుల కెేటాయింపులు చేయకుండా ప్రభుత్వం నోటిమాటల తో మాయచేస్తున్నదని విమర్శించారు. జీవో నెం190 ప్రకారం 5లక్షల మంది వృత్తిదారులు అన్ లైన్ ద్వారా దరాఖాస్తులు చేశారనీ, అందులో కేవలం లక్షమందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారని తెలిపారు. మిగిలిన నాలుగు లక్షల మందికి రుణాలు మంజూరు కాలేదని చెప్పారు. అర్హత కలిగిన లబ్దిదారులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్యా పథకం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు పెంచాలన్నారు. వివిధ ఫెడరేషన్లకు ప్రత్యేక కార్యాలయాలు, అధికారుల నియామకాలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ మాట్లడుతూ దరాఖాస్తు చేసుకున్న గొర్రెలకాపరుల కు రెండో విడత గొర్రెల పంపిణీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారుల, దళారుల దోపిడీని అరికట్టాలన్నారు. మత్స్యకారులకు ప్రత్యేక బీమా పథకం ఏర్పాటు చేయాలని కోరారు. మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల.బాలకృష్ణ మాట్లాడుతూ చెరువుల లీజును ప్రభుత్వం విపరీతంగా పెంచిందన్నారు. మత్స్య కార్మికుల పై తీవ్రమైన భారాలు వేస్తుందని తెలిపారు. తక్షణమే చెరువుల లీజులను తగ్గించాలనీ, మత్స్యవృత్తిని ఉపాధి వృత్తిగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మత్స్య సంపదకు గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు.లేదంటే వచ్చే అసెం బ్లీ సమావేశాల సమయంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రజకవృత్తి దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ళ ఆశయ్య, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శులు కొప్పు పద్మ, అరవపల్లి శ్రీరాములు, తేలు ఇస్తారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పగడాల నాగేశ్వరరావు, చనమొని శంకర్, మురారి మోహన్ తదితరులు పాల్గొన్నారు