Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎండమావిగా మైనార్టీ సంక్షేమం
- నేతల మాటలు నీటి మూటలే
- ముస్లింల అభివృద్ధిపై సర్కార్ నిర్లక్ష్యం
''ముస్లిం మైనార్టీలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం. అందుకనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నాం''.-రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఖర్చు పెడుతున్న నిధులు చాలా తక్కువ. అవసరాలు అనేకం ఉన్నా..వాటి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నది.కానీ..తనది మైనార్టీల పక్షపాత ప్రభుత్వమని గొప్పలకు పోతున్నది. వాస్తవ కేటాయింపులు, ఖర్చుల గణాంకాలను పరిశీలిస్తే నేతల మాటలు నీటి మూటలేనని మరో సారి తేటతెల్లమవుతున్నది. గడిచిన ఏడేండ్లలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొత్తం బడ్జెట్ సుమారు రూ. 10,85,435కోట్లు. దీనిలో మైనార్టీ సంక్షేమానికి రూ. 11,106కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇది మొత్తం బడ్జెట్లో ముస్లింలకు కేటియించింది ఒక్క శాతం మాత్రమే. కేటాయించిన బడ్జెట్లో ఖర్చు అయింది రూ. 6,499 కోట్లు మాత్రమే. రాష్ట్రంలో ఒక పెద్ద సమూహపు సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధుల శాతం ఇంత తక్కువ స్థాయిలో ఉంటే ఎలా?అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇకపోతే ముస్లింలకిచ్చిన వాగ్దానాలు నీటి మూటలుగా మిగిలాయి. 12శాతం రిజర్వేషన్లతో పాటు అనేక హామీలు నేటికీ నెరవేరలేదు. కనీసం వార్షిక బడ్జెట్లో 12శాతం నిధులను కేటాయించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. షాదీముబారక్ ధరఖాస్తులు సుమారు 25వేలు, ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి ధరఖాస్తులు మరో అరలక్షకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. గొప్పగా చెబుతున్న సంక్షేమ పథకాలు ఆచరణలో ముస్లింల దరి చేరటం లేదు.
దినసరి కూలీలుగానే..
నేటికి రెక్కల కష్టం మీద ఆధార పడి జీవించే వారి సంఖ్య ఎక్కువ. పురుషుల్లో 52శాతం దినసరి కూలీలుగానే ఉన్నారు.ఎక్కువ మంది క్యాజువల్ కార్మికులుగా శ్రమను నమ్ముకొని బతుకుతున్నారు. టైరు పంక్షర్లు వేయటం ఒక వృత్తిగా మార్చుకున్నారు. హకర్స్గా, ఇతర చిన్నచిన్న వ్యాపారాలతో కాలం గడుపుతున్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలు నామమాత్రమే. మల్టీ సెక్టోరల్ అభివృద్ధి కోసం గతం కంటే రూ. 30 కోట్లు తగ్గించారు. దీంతో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్థిక సహాయం నిలిచిపోయింది. 2016-17 సంవత్సరంలో చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలని లక్షా డెబ్బై ఆరువేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఆరేండ్ల కాలంలో కేవలం ఎనిమిది వేల మందికి మాత్రమే ఆర్థిక సహాయం అందిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఆర్థికంగా చితికిపోయిన, విద్య, ఉద్యోగాలలో వెనుకబడిన మైనారిటీలు అభివృద్ధి చెందాలంటే బడ్జెట్ పెంచకుండా సాధ్యం కాదు. ప్రభుత్వం నియమించిన సుధీర్ కమీషన్ నివేదిక ఇదే విషయాన్ని చెప్పింది. మైనార్టీ బంధు లాంటి పథకాలు ప్రవేశపెట్టి యువతకు, మహిళలకు, చిరు వ్యాపారులకు ఉపాధి కల్పన కోసం ఆర్థిక సహాయం అందించాలి. అందుకు రూ. ఐదువేల కోట్లు కేటాయించాలి. ప్రణాళికా బద్దంగా ఖర్చుచేయాలన్న మైనార్టీల డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి.
''గత ఏడేండ్లలో మైనార్టీల సంక్షేమ కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.6,199 కోట్లు ఖర్చు చేసింది. అదే హరిత హారంపై ఇంతరవరకు రూ.6,555 కోట్లు ఖర్చు పెట్టింది. మొక్కల కన్నా ముస్లింలు హీనమా?'' అక్బరుద్దీన్ ఓవైసీ...
''ప్రభుత్వం గొప్పలకు పోతున్నది. బారెడు కేటాయింపులు చూపెట్టి, మూరెడు మాత్రమే ఖర్చు చేస్తున్నది. మైనార్టీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయటం లేదు. ప్రచారార్బాటమే. వారి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. సర్కార్ చిత్తశుద్ధితో పనిచేయాలి.
-ఎండీ అబ్బాస్ ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఏడేండ్లుగా బడ్జెట్ లో కేటాయింపులు, ఖర్చు వివరాలు...
సంవత్సరం.................కేటాయింపులు. కోట్లలో.........ఖర్చు. కోట్లలో............శాతం
2014-15......... రూ.1030............................ రూ.307.86.........29
2015-16......... రూ.1130........................... రూ.409.52..........42.35
2016-17......... రూ.1204........................... రూ.863.36..........71.94
2017-18......... రూ.1249.49...................... రూ.962.71..........78.51
2018-19......... రూ.2000........................... రూ.703.24..........35.63
2019-20........ రూ.1369............................ రూ.1266.............94.21
2020-21........ రూ.1518.05....................... రూ.658,43..........43.50
2021-22........ రూ.1606........................ రూ.