Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు రేవంత్ సవాల్
- చేతగాకనే ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకున్నావు
- 12నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
- తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ
- ప్రగతిభవన్‌ను అంబేద్కర్ నాలెజ్జి సెంటర్‌గా మారుస్తాం
- ముగిసిన నిరుద్యోగ దీక్ష...నిమ్మరసమిచ్చిన రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేయాలనీ, ఆయనకు దమ్ముంటే మళ్లీ గెలువాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆయనకు చేతగాకనే బీహార్‌కు చెందిన ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నదనీ, గోల్కొండ కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తా మని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం హైదరా బాద్‌లోని గాంధీభవన్‌లో రెండు రోజులుగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి చేపట్టిన దీక్షను ఆయనకు నిమ్మరసమిచ్చిన విరమింప చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాళ్ళయినా మొక్కుతానని చెప్పారు. 'కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా. ప్రగతిభవన్‌ను అంబేద్కర్ నాలెడ్జి సెంటర్‌గా మారుస్తా. మొదటి సంతకం దానిమిదే. మా దగ్గర ఒక రోగం ఉంది. ఒకరు పాట అందుకున్నప్పుడు మరొకరు పాడరు. అందరం ఒక్కసారి అందుకోక పోవడం కాంగ్రెస్ బలహీనత. అందరం ఓకేసారి పాడి అధికారంలోకి వస్తాం. ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి. బాబు మోహన్‌కి ఎక్కువ బ్రహ్మానందానికి తక్కువ. ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రగతి భవన్ బానిస. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది పేదోళ్ల బిడ్డలు నేలకొరిగారు. కేసీఆర్ పాలనలో కూడా ఎంతోమంది పేదింటి బిడ్డలు, నిరు ద్యోగులు చనిపోతున్నారు. పెట్రోల్ మీద పోసుకుని అగ్గిపెట్టె మర్చిపోయి హరీశ్‌రావు డ్రామా ఆడారు. తెలంగాణకు పట్టిన చీడైన కేసీఆర్‌ను తరిమేసిన ప్పుడే తెలంగాణ సమస్యలు తీరుతాయి' అన్నారు. యువకుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కంటే, తనకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటేనే తనకు ఇష్టమన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఎనిమిదేండ్లు అయిందనీ, ఇప్పటికీ నోటిఫికేషన్లు వేయలేదని విమర్శించారు. ఈ కారక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, నాయకులు అంజన్‌కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, సపంత్‌కుమార్ తదితరులు మాట్లాడారు.