Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న
- రాజకీయ వ్యవస్థ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించింది
- సమాజానికి పాఠం చెప్పాలంటే ముందు రాజ్యాంగం చదవాలి: ప్రొఫెసర్ కె. నాగేశ్వర్
నవ తెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
బీఎస్ఎన్ఎల్, పోస్టల్, ఎల్ఐసీ, రైల్వే వంటి పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మ చూస్తుంటే.. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నదని ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిలిటెంట్ పోరాటాలకు స్ఫూర్తిదాయకమైన టీఎస్ యూటీఎఫ్ లాంటి ఉద్యమ సంఘాల వల్లనే నేను ఈ స్థాయికి ఎదిగానని గుర్తుచేసుకున్నారు. ఒకవైపు శాస్త్ర, విజ్ఞాన రంగాల్లో పరుగులు పెడుతున్న నవ సమాజంలో మూఢనమ్మకాలను ప్రజ్వలింపజేసి జ్యోతిష్య శాస్త్రాన్ని పాఠ్యాంశంగా చేర్చడం కేంద్ర ప్రభుత్వ విధానాలకు దర్పణం పడుతుందన్నారు. టీఎస్ యూటీఎఫ్లో ఉన్నవారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేక ఉద్యమాలు చేస్తూ హక్కులను సాధించుకుంటారని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ.. మన దేశంలో రాజకీయ వ్యవస్థ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. సమాజానికి పాఠం చెప్పాలంటే ముందు రాజ్యంగం మనం చదవాలని తెలిపారు. అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం కల్పిస్తే.. దాన్ని సైతం అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని తమ కుటిలత్వం వల్ల జీవంలేని యంత్రం లాగా తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తూ ప్రశ్నించేవారిని జైలుకు పంపుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూనే రాజ్యాంగాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.