Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉక్రెయిన్ విద్యార్థులను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. నిరంతరం కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహకారంతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఉచిత విమాన టికెట్లు సహా పలు చర్యలను చేపట్టింది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్తో సహా హైదరాబాద్లోని సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసిన ఉక్రెయిన్ విద్యార్థుల క్షేమ సమచారాన్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు చేరవేస్తున్నది. దీంతో పాటు ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నది. ఆదివారం పలువురు విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాగా వారికి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. విద్యార్థులకు స్వాగతం పలికిన వారిలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తదితరులున్నారు.