Authorization
Sat March 22, 2025 10:38:44 am
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకుగానూ ఈ నెల ఆరో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ ప్రకటిం చారు. సోమవారం హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాకు జోనల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. ఏప్రిల్ 14 నుంచి రెండో దశ 'ప్రజా సంగ్రామ యాత్ర' ప్రారంభిస్తున్నామని చెప్పారు. మార్చి నెలాఖరులో జనగామలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించి సీఎం కేసీఆర్కు తమ పార్టీ సత్తా చూపుతామన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల సంఘానికి సమర్పిం చిన తప్పుడు అఫిడవిట్ పై ఫిర్యాదు చేసిన వారిని పోలీసులే కిడ్నాప్ చేయడం, వారిపైనే 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం దారుణమని విమర్శిం చారు. మంత్రి రాజీనామా చేసే వరకు ఆందోళనలు నిర్వహిస్తామ న్నారు. మంత్రులతో పాటు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉద్యమిస్తా మని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయ్యిం దని తెలిపారు. సీఎం కేసీఆర్ బోగస్ సర్వే ఫలితాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్, జాతీయ సహాయ కార్యదర్శి (సంస్థాగత) శివ ప్రకాశ్, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, సీనియర్ నేత ఎన్. ఇంద్రసేనారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు. ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాస్ (సంస్థాగత) పాల్గొన్నారు.