Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అభం శుభం తెలియని బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టిన షేక్ సాజిద్‌ను కఠినంగా శిక్షించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మెన్‌గా అతన్ని తొలగించాలనీ, టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అతనికి సహకరించినవారిపై చట్టపర చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. లైంగిక దాడులు, వేధింపులకు మూల కారణాలను నిర్వీర్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా వారికి బెయిల్ రాకుండా తగిన సెక్షన్లను నమోదు చేయాలని డిమాండ్ చేశారు.