Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పల్లెప్రగతి కార్యక్రమం అమలులో భాగంగా ఫిబ్రవరి 2022 గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.227. 50 కోట్లను విడుదల చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతినెలా నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరికిగానూ గ్రామపంచాయతీలకు 210 కోట్ల 44 లక్షల రూపాయలు, మండల పరిషత్‌లకు 11 కోట్ల 37 లక్షల రూపాయలు, జిల్లా పరిషత్‌లకు 5 కోట్ల 69 లక్షల రూపాయలు ఇచ్చామని పేర్కొన్నారు. 2019 సెప్టెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు పల్లె ప్రగతి కింద స్థానిక సంస్థలకు రూ. 8,569.50 కోట్ల విడుదల చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2001-2022 మొదటి విడతగా 682 కోట్ల 50 లక్షల రూపాయల నిధులే విడుదలయ్యాయనీ, రెండో విడత నిధులు విడుదల కానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు విడుదల చేసిందన్నారు.