Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టెక్సైటైల్ రంగ అభివద్ధికి త్వరలో రోడ్‌మ్యాప్ నివేదికను తయారు చేయాలని ఆ శాఖ మంత్రి కే తారకరామారావు అధికారుల్ని ఆదేశించారు. ఈ రంగంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తున్నదనీ, దీన్ని మరింత బలోపేతం చేసే దిశగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. సోమవారంనాడాయన ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడచిన ఏడున్నరేండ్లలో నేతన్నల ఆర్ధికాభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ రంగంలో ఉపాధి కల్పనే ప్రాథమిక లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి టెక్సైటైల్ రంగమే ఉపాధి కల్పిస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో టెక్సైటైల్ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, టీఎస్ఐఐసీ ఎమ్డీ వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.