Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగికదాడి బాధితురాలికి న్యాయం చేస్తాం..:మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ-నిర్మల్
బాలికపై లైంగికదాడికి ఒడిగట్టిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మెన్ షేక్ సాజిద్‌ను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. సాజిద్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతని పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు చెప్పారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందన్నారు. లైంగికదాడి ఘటన హేయమైన చర్య అన్నారు. సాజిద్‌పై ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ గండ్రత్ ఈశ్వర్, సోన్ జెడ్పీటీసీ జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము పాల్గొన్నారు. బాలికపై కన్నేసిన సాజిద్ మధ్యవర్తిగా ఓ మహిళతో అమ్మాయికి మాయమాటలు చెప్పించి.. నమ్మించి హైదరాబాద్ తీసుకెళ్లి లైంగికదాడి చేసిన విషయం విదితమే.