Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పకడ్బందీగా 'మన ఊరు-మన బడి'ని అమలు చేయాలి
- 317 జీఓను సవరించాలి
- ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి :టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి
నవతెలంగాణ - కందనూలు
సీపీఎస్ రద్దే లక్ష్యంగా టీఎస్ యూటీఎఫ్ పోరాటాలు చేస్తుందని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో నిర్వహించిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మన ఊరి-మన బడి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాద్యమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేయాలన్నారు. రాజ్యాంగ విలువలైన లౌకిక, ప్రజాస్వామ్య, శాస్త్రీయ దృక్పథాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రీకరణ, వ్యాపారీకరణ, మతతత్వ మూఢ విశ్వాసాలకు పెద్దపీట వేసేలా ఉన్న జాతీయ విద్యావిధానాన్ని మార్చాలన్నారు. 317 జీఓను సవరించి నష్టపోయిన ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, అటెండర్, వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ప్రతినిధులు 12 అంశాలను ఆమోదించారు.కేజీబీవీ సిబ్బందికి పీఆర్సీని వర్తింపజేయాలని కోరుతూ నిరసన తెలిపిన కారణంగా సర్వీస్ నుంచి రిమూవ్ అయి టీఎస్ యూటీఎఫ్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సహకారంతో మళ్లీ విధుల్లో చేరిన కేజీబీవీ ఎస్ఓ గోపిలతకు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాల సందర్భంగా యూటీఎఫ్ పోగు చేసిన రూ.1.27 లక్షల చెక్కును ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు సీహెచ్ రాములు, చావ ధుర్గా భవాని, కోశాధికారి టి.లక్ష్మా రెడ్డి, ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు మోత్కూరి సంయుక్త, రాష్ట్ర కార్యదర్శులు బి.నర్సింహారావు, ఎ.వెంకట్, ఎం.రాజేశేఖర్ రెడ్డి, వి.శాంతకుమారి, ఆర్.శారద, డి.సత్యానంద్, ఈ.గాలయ్య, జి.నాగమణి, ఎస్.రవి ప్రసాద్‌గౌడ్, కె.రవికుమార్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వహీద్ ఖాన్, ఎం.శ్రీధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.