Authorization
Sat March 22, 2025 10:47:01 am
- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ఆర్.శోభ నియామకం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్)గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్‌ను రాష్ట్ర సర్కారు సోమవారం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేసింది. ఇప్పటివరకూ పీసీసీఎఫ్‌గా ఉన్న ఆర్.శోభ సోమవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన ్లో ఉద్యోగ విరమణ చేశారు. కానీ, ఆమె సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు(అటవీ వ్యవహారాలు)గా నియమిస్తూ జీవో నెంబర్ 474ని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆమె రెండేండ్ల పాటు విధుల్లో ఉండనున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన డోబ్రియల్ 1987లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో చేరారు. ట్రైనింగ్ తర్వాత 1989లో పాల్వంచ సబ్ డీఎఫ్ఓగా నియమితులయ్యా రు. ఆతర్వాత 1991-94 దాకా భద్రాచలం డివిజనల్ ఫారెస్ట్ అధికారిగా పనిచేశారు. అదే హౌదాలో 2002 వరకు వరంగల్, బెల్లంపల్లి డివిజన్లలో విధులు నిర్వర్తించారు. కన్జర్వేటర్‌గా పదోన్నతి పొందిన తర్వాత అడిషనల్ సెక్రటరీ హౌదాలో సచివాలయంలో వ్యవసాయ శాఖ, ఉన్నత విద్యాశాఖల్లో డిప్యూటేషన్‌పై పనిచేశారు. ఆ తర్వాత స్పెషల్ సెక్రటరీ హౌదాలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా వివిధ యూనివర్సిటీలకు ఇన్చార్జి వైస్ ఛాన్స్‌లర్‌గా 2003 నుంచి 14 వరకు కూడా విధులు చేపట్టారు. ఆ తర్వాత 2015లో అదనపు పీసీసీఎఫ్ హౌదాలో తిరిగి అటవీ శాఖలో చేరి, విజిలెన్స్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ విధులు నిర్వహించారు. 2016లో తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్‌గా నియమితులై ఇప్పటిదాకా పనిచేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన హరితహారాన్ని విజయవం తం చేయటంలో, పచ్చదనం పెంపునకు అన్ని శాఖల సమన్వయంలో డోబ్రియల్ కీలకపాత్ర పోషించా రు.2020లో పీసీసీఎఫ్ ర్యాంకు పొందిన ఆయన 2025 ఏప్రిల్ వరకు సర్వీసులో కొనసాగుతారు. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ లాంఛనాల తర్వాత పూర్తి స్థాయి పీసీసీఎఫ్ గా ఆయన కొనసాగే అవకాశం ఉంది. పీసీసీఎఫ్‌గా నియమితులైన డోబ్రియల్‌ను అటవీ,పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకర ణ్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, పదవీ విరమణ పొందిన పీసీసీఎఫ్ ఆర్. శోభ, అటవీశాఖ ఉన్నతాధికారులు, స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియే షన్, రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, జూనియర్ ఆఫీసర్ల సంఘం, సిబ్బంది అభినందించారు.