Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుద్ధాలను నివారించాలి
- ఐప్సో కొవ్వొత్తుల ప్రదర్శనలో నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ దేశాలు శాంతి ఒప్పందాలను అమలు చేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపాలని వారు కోరారు. తమకు ప్రపంచ శాంతి కావాలనీ, యుద్ధోన్మాదం నశించాలని ఆకాంక్షించారు. అణ్వా యుధాలను నిర్వీర్యం చేయాలనీ, అమెరికా నాటో సేనలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లా డుతూ యుద్ధంతో జన నష్టం, వాతావరణ కాలుష్యం తప్ప ప్రయో జనం లేదన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని డిమాండ్ చేశారు. సామ్రాజ్యవాద అమెరికా కవ్వింపు చర్యలతో నాటో ను రెచ్చగొడుతున్నదనీ, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ యుద్ధ వాతావర ణాన్ని కల్పిస్తున్నదని విమర్శించారు. 1991లో రష్యా అధ్యక్షులు గోర్బ చెవ్ - అమెరికా అధ్యక్షులు జార్జ్ బుష్ మధ్య జరిగిన శాంతి ఒప్పం దాన్ని అమలు చేసి అణ్వాయుధాలన్నింటిని నిర్వీర్యం చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఆయుధాలు ప్రపంచాన్ని 20 సార్లు నాశనం చేసేంత శక్తివంతమైనవని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ మంతా నష్టపోతున్నదనీ, ఇప్పటికే ఆయిల్, కూర గాయలు ధరలు పెరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఐప్సో ప్రధాన కార్యదర్సి డాక్టర్ సుధాకర్, రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఆర్.జీ.వినోద్ రెడ్డి, హైదరాబాద్ కౌన్సిల్ కమిటీ సభ్యులు కామేష్ బాబు, ఎ.కె.పాషా, నరహరి, ఎ.శ్రీరాములు, నాయకులు కెవిఎల్, ఉష, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.