Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)లో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో స్పాన్సర్డ్ కోర్సులు ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీ శ్రీనివాసులు తెలిపారు. ఈ కోర్సుల ముగింపు కార్యక్రమం సోమవారం ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో జరిగింది.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెషిన్ ఆపరేటర్ ఆసిస్టెంట్-ఇంజెక్షన్ మౌల్డింగ్ కోర్సు ను ప్రవేశపెట్టినట్టు ఎన్టీపీసీ రామగుండం, తెలంగాణ సీజీఎమ్ సునీల్‌కుమార్ తెలిపారు. మూడు నెలల ఈ కోర్సులో పది మంది బాలికలతో పాటు మొత్తం 40 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. వారందరికీ అర్హత సర్టిఫికెట్లు ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ ఏజీఎమ్ (హెచ్ఆర్) విజయలక్ష్మి, డీజీఎమ్ డీఎస్ కుమార్, సీపెట్ చీఫ్ మేనేజర్లు ఏకే రావు, వీ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.