Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంబైన్డ్ హయ్యర్ సెకండరీ స్థాయిలో పరీక్షలు
- ఆన్లైన్లో ఏడో తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ స్థాయిలో పలు పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థల పరిధిలో పలు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఆన్లైన్లో ఈనెల ఏడో తేదీ నాటికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. లోయర్ డివిజనల్ క్లర్క్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్, వివిధ మంత్రిత్వ శాఖలు, వివిధ శాఖలు, కార్యాలయాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్, రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, ట్రిబ్యునళ్లలో వివిధ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, వయోపరిమితి, విద్యార్హతలు, ఫీజు, పరీక్షల వివరాలు, ఎలా దరఖాస్తు చేయాలి వంటి వివరాలతోపాటు నియామకాల నోటీసు షషష.రరష.అఱష.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది. ఆ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈనెల ఏడోతేదీ నాటికి దరఖాస్తులను సమర్పించాలని కోరింది. ఎనిమిదో తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశముందని ప్రకటించింది. దక్షిణాది ప్రాంతాలు, టయర్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు మేలో 23 పట్టణాలు, నగరాల్లో జరుగుతాయని తెలిపింది. ఇందులో ఏపీలో 11, తెలంగాణలో మూడు, తమిళనాడులో ఎనిమిది, పాండిచ్చేరిలో ఒక కేంద్రం ఉన్నాయని వివరించింది.