Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు రోజులపాటు అక్కడే మకాం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన మూడు రోజులపాటు అక్కడే మకాం వేయనున్నారని తెలిసింది. ఇది పూర్తిగా రాజకీయ పర్యటనే అని సమాచారం. దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానంటూ ఇటీవల చెప్పుకొచ్చిన కేసీఆర్... అందుకనుగుణంగానే హస్తినలో పలు పార్టీల నేతలను కలవనున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాలతో ఆయన భేటీ కానున్నారని వినికిడి. సీఎం పర్యటనలో ఆయన వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి శ్రీనివాసగౌడ్ తదితరులున్నారు. మరోవైపు ఇటీవల చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. కానీ స్టాలిన్ జీవితంపై రాసిన పుస్తకావిష్కరణ సభకు కేసీఆర్ దూరంగా ఉండటం గమనార్హం. ఆ సభలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, కేరళ సీఎం పినరయి విజయన్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తదతరులు పాల్గొన్నారు.