Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిన నీరు
- రహదారిపై రాకపోకలకు అంతరాయం
నవతెలంగాణ- హాజీపూర్
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల్లాలో గోదావరి పుష్కర ఘాట్ రోడ్డు వద్ద మిషన్ భగీరథ మెయిన్ లైన్ లీకైంది. ఎమ్మెస్ పైప్ జాయింట్ వద్ద పగిలిపోవడంతో నీరు ఒక్కసారిగా 50 మీటర్ల ఎత్తుకు ఎగిడిపడింది. ఉదయం 12 గంటల సమయంలో పైప్‌లైన్ లీక్ కాగా.. గ్రిడ్ సిబ్బందికి సమాచారం అందించవ్వగా.. 45 నిమిషాల అనంతరం వాటర్ సప్లై ఆపేశారు. హాజీపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కాగా, ఎల్లంపల్లి నుంచి మిషన్ భగీరథ ద్వారా చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలకు నీటి సరఫరా చేస్తున్నారు. మూడేండ్లుగా ఇలా తరచూ పైప్లైన్లు పగిలి భారీగా నీరు వృథా అవుతున్న ఘటనలు జరిగాయి. గతేడాది గుడిపేట్ వద్ద ఇదే పైప్‌లైన్ లీక్ కావడంతో ఒక ఇల్లు పూర్తిగా నీట మునిగింది. కాంట్రాక్టర్ నాసిరకం పనులతో చేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని తోడి ఫిల్టర్ చేసి గుడిపేట్ శివారులోని బుగ్గగట్టు గుట్ట వద్ద పెద్ద ట్యాంక్ ఏర్పాటు చేసి అక్కడికి భారీ మోటర్ల ద్వారా నీటిని తరలిస్తారు. రెండు నియోజకవర్గాలకు సరఫరా చేసే క్రమంలో ఎల్లంపల్లి నుంచి గుట్ట వద్ద ట్యాంక్‌కు చేరే క్రమంలో గుడిపేట్ కపిల్ వెంచర్ వద్ద మెయిన్ పైప్‌లైన్ లీకేజీ అయింది.