Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల అంచనాలు తారుమారు
- ఐదు కోట్ల ఆదాయం
నవతెలంగాణ- సిటీబ్యూరో
తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు విశేష స్పందన వచ్చింది. మొదటి రోజే ఐదు లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. అధికారుల అంచనాలే తారుమారయ్యాయి. రోజుకు సుమారు రెండు లక్షల చలాన్లు.. రెండు కోట్ల ఆదాయం రావొచ్చనుకుంటే..రెట్టింపుకు పైగా చలాన్లు క్లియరెన్స్ అయ్యాయి.వాహనాల పెండింగ్ చలాన్లలో రాయితీ ప్రకటించడంతో మంచి స్పందన వచ్చింది. పెండింగ్ చలాన్లు చెల్లింపులో వాహనదారులకు ఆరేండ్లుగా ఎలాంటి రాయితీ ఇవ్వకపోగా, కనీసం లోక్‌అదాలత్ నిర్వహించలేదు.దాంతో రాష్ట్ర వ్యాప్తం గా దాదాపు నాలుగు కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.మంగళవారం మొదటి రోజు ప్రతి నిమిషా నికీ 700 పెండింగ్ చలాన్లను వాహనదారులు క్లియర్ చేశారు. ఆన్లైన్, ఈ-చలాన్ వెబ్సైట్ ద్వారా పెండింగ్ చలాన్లను చెల్లిస్తుండటంతో పలు చోట్ల సర్వర్ డౌన్ అయినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉండగా..అందులో హైదరాబాద్, సైబరాబాద్,రాచకొండ మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కోటీ 30లక్షల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ చలాన్ల వెబ్సైట్ (https://echallan.tspolice. gov.in)లో ప్రత్యేక లింక్ అందుబాటులోకి రావడంతో తొలి 10 గంటల్లో 1.90 లక్షల చలాన్లు చెల్లింపులు చేసినట్టు సమాచారం. అర్ధరాత్రి వరకు ఐదు లక్షల పెండింగ్ చలాన్లు క్లియర్ కాగా.. ఈ చలాన్ల చెల్లింపుల ద్వారా రూ.ఐదు కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ అయినట్టు సమాచారం.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి :
ట్రాఫిక్ బాస్
పెండింగ్ చలాన్ల చెల్లింపులో విశేష స్పందన లభిస్తోందని హైదరాబాద్ ట్రాఫిక్ బాస్ రంగనాథ్ తెలిపారు. రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ-చలాన్ ద్వారా అన్ని పెండింగ్ చలాన్లు చెల్లించొచ్చన్నారు. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. మీ సేవ, ఈ సేవలో కూడా చెల్లించొచ్చన్నారు. ఈనెల 30వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ అమల్లో ఉంటుందన్నారు.