Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు సీఎమ్‌డీ అభినందనలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్ ఈ ఏడాది అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. బొగ్గు రవాణాలో గత ఏడాది కంటే 40 శాతం వద్ధిని సాధించింది. ఉత్పత్తిలో 33 శాతం, ఓబీ వెలికితీతలో 20 శాతం వద్ధిని సాధించింది. విద్యుత్ టర్నోవర్‌లోనూ 19 శాతం వద్ధిని సాధించినట్టు ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు.
గతేడాది ఫిబ్రవరి నాటికి 425 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన సింగరేణి ఈ ఏడాది 40 శాతం వద్ధితో 595 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిందన్నారు. గతేడాది ఇదే సమయానికి 442 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది అదే కాలానికి 33 శాతం వద్ధితో 586 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిందన్నారు. ఓవర్ బర్డెన్ వెలికితీతలో గతేడాది 288 లక్షల క్యూబిక్ మీటర్లు సాధించగా, ఈ ఏడాది 20 శాతం వద్ధితో 346 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తొలగించినట్టు వివరించారు. గత ఏడాదితో పోల్చితే భారీ యంత్రాల వినియోగం, ఓఎంఎస్ కూడా గణనీయంగా పెరిగిందన్నారు. కార్మికులందరూ నిర్దేశిత లక్ష్యాలు సాధించడానికి మంచి ఉత్పాదకత, భద్రత, నాణ్యత పాటిస్తూ కషి చేస్తున్నారని పేర్కొంటూ వారికి అభినందనలు తెలిపారు.
సింగరేణి థర్మల్ విద్యుత్‌లో గతేడాది 6,703 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, రూ.2,964 కోట్ల అమ్మకాలు చేయగా, ఈ ఏడాది 19 శాతం వద్ధితో 8,459 మి.యూ., ఉత్పత్తి చేసి, రూ.3,523 కోట్ల అమ్మకాలు జరిపినట్టు వివరించారు. దీనితో పాటు సంస్థ పరిధిలో 8 చోట్ల ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ల ద్వారా ఇప్పటి వరకు 239 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసినట్టు చెప్పారు.