Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల
- ఒకే తేదీల్లో రెండు పరీక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యే తేదీల్లో మార్పు జరిగే అవకాశమున్నది. జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. ఒకే తేదీల్లో ఇంటర్ పరీక్షలు, జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు పరీక్షల షెడ్యూల్ను సవరించాలని సమాలోచన చేస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్ తేదీలను మార్చేందుకు అవకాశం లేదు. అందుకే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను అధికారులు మార్చాల్సి ఉంటుంది. వచ్చేనెల 20 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుంది. ఏప్రిల్ 20న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1, అదేనెల 21న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. అయితే ఏప్రిల్ 16,17,18,19,20,21 తేదీల్లో జేఈఈ మెయిన్స్ తొలివిడత పరీక్షలను నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. దీంతో వచ్చేనెల 20, 21న జరిగే ఇంటర్ పరీక్షల తేదీలను మార్చే అవకాశమున్నది.