Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ వ్యవస్థను కించపరుస్తున్న సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కల్వకుంట రాజ్యాంగం అమలు చేయడం ప్రారంభించారని ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంటు సభ్యులు సోయం బాపూరావు అన్నారు. మంగళవారంనాడాయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ కొత్త సెషన్స్‌ను ఉభయ సభలు సమావేశ పరిచి, ఆ రెండు సభలను ఉద్దేశించి గౌరవ గవర్నర్ ప్రసంగించిన తర్వాతనే ప్రారంభం కావాలని చెప్పారు. గవర్నర్ నుంచి వచ్చిన ఉత్తర్వుల ఆధారంగానే ఏ అసెంబ్లీ సెషన్ అయినా కొనసాగాలనీ, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ప్రసంగం లేకుండా ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తున్నారని విమర్శించారు.