Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న రైతులు
నవతెలంగాణ - కోనరావుపేట
సాగుచేసుకుంటున్న భూమిలో అటవీ శాఖ అధికారులు ప్లాంటేషన్ చేయడాన్ని రైతులు అడ్డుకున్నారు. పురుగుమందు డబ్బాలు చేతబట్టుకుని నిరసన తెలిపారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి..శివంగలపల్లె గ్రామంలోని సర్వే నెంబర్ 72, 94లో 30మంది రైతులు 60ఎకరాల్లో 30సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు. మంగళవారం అటవీ అధికారులు ఆ భూమిలో ప్లాంటేషన్ కోసం జేసీబీతో ద్వారా చదును చేసేందుకు వచ్చారు. దీంతో రైతులు అడ్డుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తాము సాగుచేసుకుంటున్న భూమిలో ఎలాంటి ప్లాంటేషన్ పెట్టొద్దని కోరారు. ఈ భూమి ప్రభుత్వానిదని, అటవీ శాఖది కాదన్నారు. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు దౌర్జన్యం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని రైతులు మోకేన రమేష్, బొడ్డు నరసయ్య పురుగుల మందు తాగేందుకు యత్నించారు. వెంటనే పక్కనే ఉన్న రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై అటవీ అధికారి మాట్లాడుతూ.. ఈ భూమి అటవీ శాఖదని, ప్లాంటేషన్ పెట్టడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు.