Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యుదయ భావాలకు నెలవు... : వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అభ్యుదయ భావాలకు నెలవు కపిల రాంకుమార్ సాహిత్యమని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శివారెడ్డి అన్నారు. కపిల రాంకుమార్ రచించిన 'కలం కలకలం' కవితా సంపుటిని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి అధ్యక్షతన మంగళవారం జరిగిన సభలో శివారెడ్డి ఆవిష్కరించారు. 'నగారా' గీతాల సంపుటిని ప్రముఖ కవి సుధామ ఆవిష్కరించారు. అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ సాంస్కృతికంగా, సాహిత్య పరంగా కవి , వ్యవసాయదారుడు ఒకటేనన్నారు. రైతు పంట పండించి సమాజాభివృద్ధికి కృషి చేసినట్టే కవి కూడా తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తాడని చెప్పారు. రాంకుమార్ కవిత్వంలో అది పుష్కలంగా ఉందన్నారు. సుధామ మాట్లాడుతూ రాంకుమార్ ధృఢచిత్తంతో రాసిన కవి అని చెప్పారు. పాటకు జనంలోకి చోచ్చుకు పోయే స్వభావం ఉంటుంద న్నారు. దానిని పట్టుకోవడంలో రాంకుమార్ విజయం సాధించారని తెలిపారు. నలభై ఏండ్లుగా అదే అభ్యుదయ భావాలు కలిగి ఉండటం విశేషమన్నారు.ప్రముఖ కవి యాకూబ్ మాట్లాడుతూ కాలం కవిని పిక్ చేస్తుందన్నారు. అదే రాంకుమార్ కవిత్వమని చెప్పారు. తంగిరాల చక్రవర్తి మాట్లాడు తూ ఎక్కడ కవిత్వం ఉంటే అక్కడ రాంకుమార్ ఉంటారన్నారు. మోదుగుపూలు సంపాదకులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాంకుమార్ కవిత్వంలో సంఘటనాత్మక కవిత్వం ఉందన్నారు. సమస్యలపై స్పందించే స్వభావం ఉందని తెలిపారు. అనంతోజు మోహన్ కృష్ణ నగారా పుస్తకాన్ని పరిచయం చేస్తూ రాంకుమార్ 30 ఏండ్ల క్రితం రాసిన కవిత్వం ఇప్పటికీ రిలవెన్స్గా ఉందని వివరిం చారు. ఈ సభలో సలీమ, నస్రీన్ ఖాన్, రచయిత కపిల రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.