Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదాయం ఉందంటూనే భారీగా కోతలు
- వ్యవసాయం, ఆరోగ్యం, గృహ నిర్మాణం, పంచాయతీల పరిస్థితి ఇది
- 2014 నుంచి 2020 వరకూ ఇదే దుస్థితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మాటలు ఘనం, ఆచరణ శూన్యం'... వివిధ శాఖలకు కేటాయింపులు, ఖర్చుకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వ పరిస్థితి ఇదే రకంగా ఉంది. ఒకవైపు ఆదాయం భారీగా వస్తోందంటూ ప్రతీయేటా చెప్పుకొచ్చిన సర్కారు, కీలక రంగాలకు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయకుండా వదిలేసింది. దీంతో ఆయా శాఖలు, రంగాలకు చెందిన నిధులకు భారీ స్థాయిలో గండిపడింది. అభివృద్ధి, సంక్షేమమనేవి తమకు రెండు కండ్లంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులందరూ చెప్పుకుంటూ వచ్చిన తరుణంలో ఇలా ఖర్చులో కోత విధించటం మూలాన వాటికి తీరని నష్టం వాటిల్లింది. ఇటీవల జీఎస్డీపీ గురించి కేంద్ర ప్రభుత్వ లెక్కలు, అర్థగణాంక శాఖ గణాంకాలను చూపి 'భేష్.. శభాష్...' అంటూ జబ్బలు చరుచుకున్న రాష్ట్ర ప్రభుత్వం, అదే జీఎస్డీపీ పెరుగుదలలో కీలక పాత్ర పోషించే వ్యవసాయానికి సైతం కోతలేసింది. మానవాభివృద్ధి సూచికల్లో ముఖ్యమైన ఆరోగ్య రంగానికి కూడా నిధు లను కట్ చేసింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రధానమైన గ్రామ పంచాయతీలకు సైతం కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా చోద్యం చూసింది. రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి 2020 వరకూ తీసిన లెక్కలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.