Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడిక్కడే ఒకరు మృతి.. చికిత్స పొందుతూ మరొకరు
- అనుమానితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రియల్ వ్యాపారుల మధ్య కాల్పులు కలకలం రేపాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని కర్ణంగూడ సమీపంలో కారుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో కారులో ఉన్న రియల్టర్ శ్రీనివాస్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి రాఘవేందర్‌రెడ్డి కారులో పారిపోతుండగా వెంబడించి కాల్పులు జరిపి పారిపోయారు. స్థానిక గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన రాఘవేందర్రెడ్డిని స్థానికంగా ఉన్న ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. బాధిత కుటుం బసభ్యుల వివరాల ప్రకారం.. ఇటీవల ముగ్గురు కలిసి 10 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారని, ముగ్గురి మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయని తెలిపారు. మంగళవారం ఉదయం మాట్లాడుకుందామని పిలిచి కాల్పులు జరిపారని కుటుంబసభ్యులు వాపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసిన మట్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఇబ్రహీంపట్నం ఏసీపీ ఆధ్వర్యంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.