Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పి.డి.ఎస్.యు(విజృంభణ)
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సామ్రాజ్యవాద దేశాలైన రష్యా, అమెరికాల దురాక్రమణ, రాజ్య విస్తరణ కాంక్షలో భాగంగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం సంభవించిందని పీడీఎస్యూ (విజృంభణ) రాష్ట్ర అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయిసిడం బాపురావు, కే ఆనంద్ అన్నారు. ఈ యుద్దానికి పూర్తి కుట్రదారు అమెరికా, నాటో కూటమేనని పేర్కొన్నారు. యురేనియం, థోరియం, మెర్క్యూరి వంటి భూగర్బ ఖనిజాలు కలిగిన ఉక్రెయిన్ దేశాన్ని రష్యా అక్రమించాలనుకోవడం ప్రపంచ దేశాలపై ఏకఛత్రాధిపత్యం వహిస్తూ విద్వంసం చేసేందుకే రష్యా యుద్ధానికి సిద్ధపడిందన్నారు. తక్షణం శాంతిచర్చలు జరపాలని డిమాండ్ చేశారు. యుద్దోన్మాద చర్యలు ప్రోత్సహిస్తూ చిన్నదేశాల దురాక్రమణలకు కారణమవుతున్న నాటో సైనిక కూటమిని రద్దు చేసేవిధంగా ఐక్యరాజ్యసమితి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. యుద్దంలో మరణించిన ఉక్రెయిన్, రష్యా పౌరులు, సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రపంచదేశాల ప్రజలు ముందుకు రావాలని కోరారు.