Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భూ వివాదాల కారణంగా ఇబ్రహింపట్నంలో రియాల్టర్ల హత్య ఆందోళన కలిగిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ధరణిలో లొసుగుల కారణంగా తలెత్తిన భూ వివాదాలు ఈ హత్యకు దారితీసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయని తెలిపారు. ధరణి పోర్టల్లోని లొసుగులను సరిచేయకుండా కాలయాపన చేస్తున్నందున రాష్ట్ర వ్యాపితంగా పలు చోట్ల భూ వివాదాలు తలెత్తుతున్నాయనీ, దీనిపై పది డిమాండ్లతో గతంలోనే ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు చెప్పారు. ఈ సమస్యలపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందనీ, ఇప్పటికీ ఆ ఉపసంఘం ఏం చర్యలు తీసుకున్నదో తెలియకపోవడం దారుణమని విమర్శించారు. ధరణి సమస్యలపై అవసరమైన సూచనల కోసం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూ, రియల్ ఎస్టేట్ మాఫియాను అరికట్టాలని కోరారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వీరి బారిన పడి తమ జీవిత కష్టార్జితాన్ని నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.