Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జైపాల్‌యాదవ్ సలహాదారుడిగా ఉన్న సంస్థే :
రేవంత్‌ను కలిసిన బాధితులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సలహాదారుడిగా ఉన్న ముద్ర వ్యవసాయ సహకార సంఘం...దాదాపు రూ 500 కోట్లు టోకరా వేసిందని సంబంధిత బాధితులు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన్ను వారు కలిశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పి దాదాపు 500 కోట్ల రూపాయలు వసూలు చేసి కార్యాలయాన్ని ఎత్తివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సలహాదారుగా ఉన్న ఈ సంస్థ... కేసీఆర్ ఫొటోలతో ఉంటే నమ్మి డిపాజిట్స్ చేయించామని తెలిపారు. సంస్థ మూసేయడంతో ముగ్గురు యువకులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారనీ, ఈ విషయాన్ని అధికారులు, మంత్రి కేటీఆర్‌కు టీఆర్ఎస్ నాయకులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదని వివరించారు. ఈవిషయంలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.