Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బుధవారం 154 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కోవిడ్ స్టేటస్ బులిటెన్లో పేర్కొంది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 52 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్టు తెలిపింది. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో 11 చొప్పున కేసులు వచ్చాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ పదిలోపే కేసులు నమోదయ్యాయి. జయశంకర్భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మెదక్, ములుగు, నాగర్కర్నూల్, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.