Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ గణాంకాల శాఖ వృద్ధి రేటు చూడండి
- బండి సంజయ్,రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా కండ్లు తెరవండి : బోయినపల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధిలోనూ శరవేగంగా దూసుకుపోతున్నదనీ, దేశంలోనే అగ్రగామి ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ నివేదిక చెబుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. వృద్ధిరేటులో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పిన ఆ నివేదికను చూసైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కండ్లు తెరవాలని హితవు పలికారు. రాష్ట్ర సర్కారుపై అనవసరంగా బురద జల్లడాన్ని మానుకోవాలని వారికి సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై చేసే విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలనీ, ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి, ప్రణాళిక, పరిపాలనా దక్షతతో రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు వేగంగా పరుగులు తీస్తోందని తెలిపారు.చిన్న రాష్ట్రమైనా దేశంలోనే చారిత్రాత్మక ప్రగతిని సాధిస్తోందని పేర్కొ న్నారు.జీఎస్డీపీలో రాష్ట్రం 11.2శాతంతో అగ్రగామిగా నిలిచిందనీ, దేశ తలసరి ఆదాయం రూ.1,49,848 ఉండగా..తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,78, 833 ఉందని వివరించారు. కేంద్రం నివేదిక ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగుల రేటు కేవలం 0.7శాతమే ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణస్థా యి సౌకర్యాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారనీ, అదే స్థాయిలో ఫలితాలను కూడా సాధిస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ గొప్పగా అమలు చేశామని పేర్కొన్నారు. ట్యాక్స్ రెవెన్యూలోనూ దేశ ఎకానమీలో తెలంగాణ అగ్ర భాగాన ఉందని తెలిపారు. భవిష్యత్‌లోనూ తెలంగాణ అభివృద్ధి దేశానికే తలమానికంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.