Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాభై ఏడేండ్లు దాటిన ఒంటరి మహిళలకు, చేనేత, బీడీ కార్మికులకు, వికలాంగులకు పింఛన్లు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా గుర్తు చేసింది.14 లక్షల మంది పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకోగా, మూడు లక్షల 18వేల మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించిందని తెలిపింది. మూడేండ్లు గడిచినా పింఛన్‌ను మాత్రం ఇవ్వలేదని పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న వారికి రూ 5వేల పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈమేరకు బుధవారం ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి డివి కృష్ణ, సహాయకార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటన విడుదల చేశారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి కార్డులివ్వాలని కోరారు. స్వంత జాగా ఉన్న వారికి రూ ఐదు లక్షలు మంజూరు చేయాలని కోరుతూ ఈనెల ఐదున తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలంటూ గురు, శుక్రవారాల్లో నిరసనలు తెలియజేయాలని పేర్కొన్నారు. పోడు భూముల సమస్యలపై ఈనెల 14న ఆర్టీవో, పీవో, కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.