Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం
- మార్చి 23 నుంచి ఏప్రిల్ 4 వరకు ప్రాక్టికల్స్
- తేదీలను ప్రకటించిన ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గతంలో ఇచ్చిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయనీ, కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆదివారాల్లో ప్రాక్టికల్స్ నిర్వహించ నున్నారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో విలువలు, మానవ సంబంధాలు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకూ ఏప్రిల్ 22 నుంచే పరీక్షలు జరుగనున్నాయి.