Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనతికాలంలోనే తెలంగాణ అనేక రికార్డులు సృష్టించిందని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీలోనూ రాష్ట్రం అగ్రగామిగా నిలవటం హర్షణీయమని పేర్కొంటూ మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 19.1 శాతం, జీఎస్డీపీలో వృద్ధి 19.46 శాతం వృద్ధి నమోదైందని ఆయన వివరించారు. ఆదాయం పెంచాలి- ప్రజలకు పంచాలనే సూత్రంతో ప్రభుత్వం ముందుకు సాగటం వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచుతూనే, మరోవైపు వచ్చిన ప్రతీ పైసాను ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు.గనున్నాయి.