Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రణవి ఫౌండేషన్, జై గణేశ భక్తి సమితి, ఆల్ ఇండియా విరాట్ విశ్వకర్మ యూత్ ఫెడరేషన్, విశ్వ బ్రాహ్మణ సమైక్య సంఘం ఆధ్వర్యంలో అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో శివరాత్రి నేపథ్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా క్లాత్ బ్యాగులతోపాటు, పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబర్పేట్ శంకర్ పైల్వాన్, సంఘ సేవకులు టిడిపి సీనియర్ లీడర్ ఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి ఉపవాస దీక్షలో ఉన్న వారికి పండ్లు పంపిణీ చేసినందుకు నిర్వాహకులకు శంకర్ ధన్యవాదాలు తెలిపారు. అంబర్‌పేట అసెంబ్లీలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రతి ఒక్కరు క్లాత్ బ్యాగ్‌లు, జూట్ బ్యాగ్‌లను వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రణవి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జైన్ కుమార్ విశ్వకర్మ, ప్రణవి ఫౌండేషన్ తెలంగాణ ఇంచార్జ్ ఆనంద్, ఉపాధ్యక్షులు ప్రభాకర్, రాష్ట్ర సలహాదారులు లు పెంటయ్య వర్మ, రాష్ట్ర సభ్యులు రమేష్ నాయక్, సాయినాథ్, భాగ్య, స్రవంతి జై గణేశ భక్తి గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు బాల్ రాజ్, శ్రీ విశ్వ బ్రాహ్మణ సమైక్య సంఘం అంబర్‌పేట అసెంబ్లీ అధ్యక్షులు గన్నోజు కృష్ణచారి, శ్రీ రామచారి, పెంటచారి, నాగరాజు చారి, లక్ష్మణ్ చారి, శంకరాచారి, బాలకృష్ణ చారి, రమేష్ చారి, బాల నర్సయ్య, గణేష్ కుమార్, ప్రణీత్, ప్రదీప్తి, విజయ తదితరులు పాల్గొన్నారు.