Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28, 29న దేశవ్యాప్త సమ్మె
- ప్రజలను కాపాడండి.. దేశాన్ని రక్షించండి నినాదంతో సమ్మె : వ్యకాస ప్రధాన కార్యదర్శి బి.వెంకట్,
- రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
విధ్వంసకర విధానాలు అనుసరిస్తున్న ప్రధాని మోడీ పాలన నుంచి ''ప్రజలను కాపాడండి.. దేశాన్ని రక్షించండి'' నినాదంతో మార్చి 28, 29న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బరితెగించి పరిపాలన చేస్తున్నదన్నారు. జాతీయత, దేశభక్తి గురించి చెబుతూ, ఆచరణలో విధ్వంసకర విధానాలను అమలు చేస్తున్నదన్నారు. సహజ వనరులు, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తున్నదన్నారు. రెండేండ్లుగా కోవిడ్ సంక్షోభంతో కార్మికులు, సామాన్య ప్రజల బతుకులు అతలాకుతలమైనా,వారిని ఆదుకునేందుకు సిద్ధపడక అమానుషంగా వ్యవహరించిందని అన్నారు.