Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల అదుపులో మున్సిపల్ వైస్ చైర్మెన్ సాజిద్‌ఖాన్, మహిళ, డ్రైవర్
నవతెలంగాణ-నిర్మల్
బాలికపై లైంగికదాడి కేసులో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మెన్ సాజిద్‌ఖాన్‌ను, సహకరించిన మహిళను, సాజిద్‌ఖాన్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్‌పేటలో మున్సిపల్ వైస్ చైర్మెన్ సాజిద్‌ఖాన్ నివాసముంటాడు. అదే కాలనీలో అన్నపూర్ణ అనే మహిళ నివాసముంటుంది. తనకు సంబంధించిన ఆస్తి తగాదాల విషయంలో ఆమె తరచూ సాజిద్‌ఖాన్ దగ్గరకు వచ్చి సమస్య పరిష్కరించాలని కోరేది. ఈ క్రమంలో ఓసారి అదే కాలనీలో తన ఇంటి సమీపంలో ఉంటున్న బాలికను వెంట తీసుకొని వెళ్లింది. ఆ బాలికపై కన్నేసిన సాజిద్‌ఖాన్.. విషయాన్ని అన్నపూర్ణకు చెప్పాడు. తన కోరిక తీరితే ఇంటి స్థలంగాని, డబుల్ బెడ్ రూమ్గాని ఇప్పిస్తానని ఆశ పెట్టాడు. దానికి ఆమె సరేనంది.
ఫిబ్రవరి 9న అన్నపూర్ణ నిజామాబాద్‌కు పని మీద వెళ్తున్నానని, తోడుగా కూతురుని పంపించాలని బాలిక తల్లికి మాయమాటలు చెప్పి నమ్మబలికింది. బాలిక తల్లి ఆమె మాటలు నమ్మి అన్నపూర్ణతో కూతురును పంపించింది. ఎలాంటి అనుమానం రాకుండా అన్నపూర్ణ తన ఇద్దరు మగ పిల్లలతోపాటు బాలికను కూడా వెంటబెట్టుకుని నిజామాబాద్‌కు బయలుదేరింది. బాలికకు మాయ మాటలు చెప్పి మార్గమధ్యలో ఆగి సాజిద్‌ఖాన్ కారులో ఎక్కింది. నిజామాబాద్ కాకుండా హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ లాడ్జిలో వేర్వేరు గదులు తీసుకున్నారు. చివరికి బాలికను భయపెట్టి సాజిద్‌ఖాన్ తన రూంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. షాపింగ్ చేసుకోమని డ్రైవర్ జాఫర్‌కు డబ్బులు ఇచ్చి పంపించేశాడు. మరుసటి రోజు తిరిగి వచ్చిన తర్వాత బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. తల్లి చైల్డ్ వెల్ఫేర్ కమిటీని సంప్రదించి వారి సహకారంతో రూరల్ పోలీస్‌స్టేషన్‌లో వీరిపై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సాజిద్‌ఖాన్, అన్నపూర్ణ, జాఫర్ పరారయ్యారు. నాలుగు రోజులుగా మహారాష్ట్రలోని ఆకోలాలో తల దాచుకున్నారు. బుధవారం ఉదయం అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరిపై సెక్షన్ 376, 363 కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.