Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూబ్లీహిల్స్ కృష్ణానగర్‌లో ఘటన
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
పదో తరగతి విద్యార్థుల మధ్య తలెత్తిన ఘర్షణ ఓ విద్యార్థి మృతికి కారణమైంది. ఈ ఘటన బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కృష్ణానగర్‌లోని సాయికృప హైస్కూల్లో జరిగింది. పదవ తరగతి విద్యార్థులు నలుగురు కలిసి మరో విద్యార్థిపై దాడి చేయగా.. తీవ్రంగా గాయపడిన అతను చనిపోయాడు. ఏసీపీ సుదర్శన్, స్కూల్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం..టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ పది మంది మాత్రమే క్లాసుకు హాజరయ్యారు. ఒంటిగంటకు లంచ్ బ్రేక్‌లో కొంతసేపు విద్యార్థులు ఆడుకున్నారు. ఆ తర్వాత క్లాస్ రూమ్లోనికి వెళ్లారు. క్లాస్ టీచర్ వెళ్లేలోపు సయ్యద్ మంజూర్(16) అనే విద్యార్థి తలకు బలమైన గాయంతో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే టీచర్ యాజమాన్యానికి చెప్పి సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, విద్యార్థి మృతిచెందినట్టు అపోలో డాక్టర్లు నిర్ధారించారు. క్లాస్‌రూమ్‌లో ఐదుగురు విద్యార్థుల మధ్య తలెత్తిన ఘర్షణే ఈ ఘటనకు దారి తీసినట్టు తెలిసింది. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు వాటర్ బాటిల్స్‌తో కొట్టుకున్నారు. సయ్యద్ మంజూర్‌పై ఉబేద్, ఖైసర్, నోమాన్, గౌరీ శంకర్ దాడిచేయకగా తీవ్రంగా గాయపడి మంజూర్ చనిపోయాడు.