Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వేములవాడ
ఎంతో కష్టపడి చదివినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదని, ఇక ఉద్యోగం వస్తుందో రాదో అనే బెంగతో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన 15 వార్డ్ కాశయ్యపల్లి (కోనాయపల్లి)లో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోస్కుల ప్రశాంత్(23) డిగ్రీ వరకు చదివి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా పలు రకాల పోటీ పరీక్షల శిక్షణలు తీసుకున్నాడు. కొన్నిరోజుల కిందట జరిగిన ఆర్మీ నియామక ప్రక్రియలో పాల్గొని విఫలమయ్యాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇంత చదివినా నోటిఫికేషన్లు లేక.. ఉద్యోగం లేదన్న బెంగ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఉదయం తన పొలం సమీపంలో ఉన్న చింతచెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని కిందకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వెంకటేష్ తెలిపారు. తమ ఫౌండేషన్ సభ్యుడన ప్రశాంత్.. కానిస్టేబుల్, ఆర్మీ శిక్షణ తీసుకొన్నాడని.. ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఇది తమ ఫౌండేషన్‌కు తీరని లోటని యువ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.