Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ భారత్ బంద్‌ను జయప్రదం చేయాలి
- సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28,29 తేదీల్లో చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు పిలుపునిచ్చా రు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అధ్యక్షతన ప్రజా సంఘాల సమావేశం జరిగింది. అందులో తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బుర్రిప్రసాద్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు, వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ, ఆవాజ్ రాష్ట్ర నాయకులు పాషా, పీఎస్ఆర్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పార్ధసారథి, ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.రమ, జె.వెంకటేష్,రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, పి.శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఎం.సాయిబాబు మాట్లాడుతూ..ఉపాధి, నిరుద్యో గ ఖాళీల భర్తీ, కనీస వేతనాలు, కార్మిక చట్టాల రద్దు, బడ్జెట్లో శ్రామిక ప్రజలపై మోపే భారాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, అధిక ధరల నియంత్రణ కోసం సమ్మె జరుగనున్నదని తెలిపారు. రాష్ట్రంలోని లక్షలాది ప్రజలను సమ్మెలో పాల్గొనేలా చేయడంలో ప్రజా సంఘాలు ఐక్యంగా కృషిచేయాలని కోరారు. పని ప్రదేశాలు, నివాస ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలను చేయాలని పిలుపునిచ్చారు. అన్ని మండల కేంద్రాల్లో, గ్రామాల్లోనూ సమ్మె ఆవశ్యకతను ప్రజలకు వివరించాలన్నారు. నూతన విద్యావిధానా న్ని వ్యతిరేకిస్తూ కూడా చైతన్యం చేయాలని కోరారు. 21వ సార్వత్రిక సమ్మెకు రాజకీయ ప్రాధాన్యత ఉన్నదనీ, పాలకులకు ప్రజల ప్రతిఘటనను మరోసారి చూపించాలని పిలుపునిచ్చారు.