Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేర్ ఆస్పత్రిలో చికిత్స
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఐ (ఎం) సీనియర్ నేత మల్లు స్వరాజ్యం (92) ఆరోగ్యం విషమించింది. వయో భారంతోపాటు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పది రోజుల క్రితం ఆమె ఒకసారి అస్వస్థతకు గురి కావటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. నాలుగు రోజుల అనంతరం తిరిగి కోలుకోవటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. సోమవారం మరోసారి ఆమె ఆరోగ్యం దెబ్బతినటంతో మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం వెంటీలేటర్పై ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.