Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 157 మంది ఐఏఎస్,139 మంది ఐపీఎస్‌లు ఉండగా బీహార్ అధికారులను అందలం ఎక్కించడం వెనక ఆంతర్యమేంటని టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐఎఎస్, ఐపీఎస్‌ల పోస్టింగ్‌లపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి చెందుతుందనీ, పరిపాలనలో మేధావి వర్గం భాగస్వామి అవుతుందని ఆశించామని కానీ అది జగరడం లేదని తెలిపారు. ఈమేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఎనిమిదేండ్లుగా ఇంకా పరాయి పాలనలోనే మగ్గుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కీలకమైన శాఖలు బీహార్ అధికారుల చేతుల్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు, అధికారులంతా బీహారీలేనని పేర్కొన్నారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అధికారులు నిరాదరణకు గురవుతున్నారని తెలిపారు. డీజీపీ పదవులు కూడా బీహార్ అధికారులకే ఇచ్చారని విమర్శించారు. హెచ్ఎండీఏ, రేరాలకు సోమేశ్ కుమార్, అర్వింద్‌కుమార్ ఇచ్చిన అనుమతులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.