Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా ఉద్యోగులకు
ఉద్యోగ భద్రత కల్పించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిదో తేదీన మహిళలకు సెలవు ప్రకటించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. 'ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో 'మహిళా బంధు కేసీఆర్' పేరిట సంబరాలు నిర్వహించాలనీ, పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఐకేపీలోని మహిళలకు గౌరవపూర్వక సన్మానాలు చేయాలని టీఆర్ఎస్ పార్టీపిలుపునిచ్చింది. సన్మానాలు తర్వాత ఎన్నోఏండ్లుగా ఉన్న వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి' అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీడీ కార్మికులు, ఆశాలు, అంగన్వాడీలు, ఐకేపీ వీఓఏలు, మధ్యాహ్న భోజనం కార్మికులు, ఇతర స్కీం వర్కర్లు, గ్రామపంచాయతీ, మున్సిపల్, మెడికల్, హెల్త్ తదితర రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలు, పిల్లలపై లైంగికదాడులు,హింస బాగా పెరిగాయనీ, పని ప్రదేశాల్లో శ్రామిక మహిళలు వివక్షత, వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టేందుకు రాష్ట్ర సర్కారు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.