Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తన కథను కాపీ చేసి అమితాబ్ బచ్చన్ ప్రముఖ పాత్రలో జుండ్ సినిమాను నిర్మించారంటూ కథా రచయిత చిన్ని ప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా రిలీజ్ అవ్వకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ వినతిని కోర్టు తోసిపుచ్చింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇటువంటి వివాదాల్లో రిట్‌ను ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ప్రయివేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా ఎలా ఉత్తర్వులు ఇస్తామని అడిగింది. రిట్‌పై తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది.
'రెరా'చైర్మన్, సభ్యులను ఎప్పటిలోగా నియమిస్తారో చెప్పండి-హైకోర్టు
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), అప్పీలేట్ అథారిటీలకు చైర్మెన్, సభ్యుల నియామకం ఎప్పటిలోగా నియమిస్తారో తెలియజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ ద్వారా చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.