Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ కాంగ్రెస్ సమావేశంలో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరికొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఐకెేపీ కేంద్రాల ఏర్పాటు, లారీల కాంట్రాక్టు, రైస్ మిల్లర్లకు టార్గెట్ వంటి చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కిసాన్ కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో రేవంత్ మాట్లాడారు.వరి కొనుగోళ్లకు ముందస్తు సన్నాహక ఏర్పాట్లు చేయాలని కోరారు. లేకపోతే రైతులకు ఇబ్బందులు వస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేసి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. కేసీఆర్ ఇక్కడ సమస్యలు సష్టించి కేంద్రంతో కొట్లాడుతున్నట్టు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రైతాంగ సమస్యలపై ఈనెల ఐదోతేదీని వ్యవసాయ కమిషన ర్కు,ఏడున గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించనున్న ట్టు తెలిపారు.13న కొల్లాపూర్‌లో మన ఊరు-మన పోరు సభ,20న కామారెడ్డిలో మరో సభ ఉంటుందని తెలిపారు.అసెంబ్లీ వేదికగా రైతాంగ సమస్యలపై పోరాడుతామన్నారు.కాంగ్రెస్ క్రమశిక్షణ విభాగం చైర్మెన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ వరిపంటతో పాటు నిజామాబాద్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ,పసు పుబోర్డు,ఖమ్మంలో మిర్చి తదితర అంశాలలో కూడా పోరాటం చేయాలని సూచించారు.మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ అసెంబ్లీలో వ్యవసాయ సమస్యలపై స్వల్పకాలిక చర్చకు పట్టుపట్టాలని కోరారు. టీపీసీసీ కార్యనిర్వా హక అధ్యక్షులు అంజన్‌కుమార్ యాదవ్, మహేష్‌కుమార్‌గౌడ్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మెన్ అన్వేశ్‌రెడ్డి, ఎస్సీ విభాగం చైర్మెన్ ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు.