Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో జీవ వైద్యవ్యర్థాల శుద్ధి కోసం ఎస్టీపీప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు కోసం రూ 68.31 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చొరవతో గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, టిమ్స్తోసహా రాష్ట్ర వ్యాప్తంగా 20 ఆస్పత్రుల్లో ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. పర్యావరణ ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఆస్పత్రుల్లో రోగుల చికిత్సలో వెలువడే జీవవైద్య (బయోమెడికల్) వ్యర్థాలను, వ్యర్ధ జలాలను బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రుల్స్ 2016 అనుగుణంగా నిర్వహణ, సక్రమంగా శుద్ధి చేయాల్సి ఉంది.లేదంటే, నీటి వనరులు కాలుష్యం బారిన పడే అవకాశం ఉన్నది. ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, పీసీబీ చైర్మెన్ రాజీవ్‌శర్మ, పీసీబీ మెంబర్ సెక్రటరీ నీతూకుమారి ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీలతో సమావేశం నిర్వహించారు. ఆ ప్లాంట్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.