Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజనుల జనాభా ప్రాతిపదికన బడ్జెట్ను కేటాయించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక ప్రగతి పద్దు చట్టం -2017 కింద వివిధ శాఖలకు కేటాయించిన నిధులను వెనువెంటనే ఖర్చు చేయాలనీ, వాటిని సద్వినియోగం చేయాలని గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. గురువారం హైదరాబాద్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్టీ ప్రత్యేక ప్రగతి పద్దు(ఎస్.డి.ఎఫ్) నోడల్ ఏజన్సీ మీటింగ్లో 28 శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయాశాఖల్లోని ప్రతి పథకాన్ని సమగ్రంగా సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ...ఎస్టీఎస్డీఎఫ్ కింద కేటాయించిన నిధులు మురిగిపోవనే ఉద్దేశ్యంతో వాటిని ఖర్చుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఈ ఏడాది ఎస్టీఎస్డీఎఫ్ కింద రూ.6,672 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు వివరించారు.
మానేరు రివర్ ఫ్రంట్ టూరిజం పనులపై ఉన్నత స్థాయి సమీక్ష
కరీంనగర్లోని మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని మంత్రుల వసతి గృహంలో టూరిజం శాఖ, కన్సల్టెన్సీ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెలలోనే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. సుమారు రూ. 100కోట్ల్ల మేర పనులకు సంబంధించిన టూరిజం తొలి విడత పనులపై అధికారులు మంత్రికి వివరించారు,వీటిపై మంత్రి సమీక్షించారు. ఆయా పనులకు సంబంధించి మంత్రి పలు సూచనలు చేశారు. డీపీఆర్ పూర్తయిన పనులకు వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ ఈడీలు శంకర్ రెడ్డి, శ్రీనివాస్, ఐఎన్ఐ కన్సల్టెన్సీ ప్రతినిధి వంశీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.